డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో తారా కళాశాలలో డిజిటల్ కరెన్సీ పై సెమినార్ జరిగింది. ఈ సెమినార్లో బీకాం, బి బి ఏ కోర్స్ చదువుతున్న విద్యార్థులు డిజిటల్ కరెన్సీ పై తమ అభిప్రాయాలను పత్ర రూపంలో సమర్పించారు. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ఇరీడియం వంటి ప్రపంచవ్యాప్త డిజిటల్ కరెన్సీ కార్యకలాపాలు ఎన్నో దేశాలను కలవర పడుతున్నాయని వీటిని నిరోధించడానికి భారతదేశంలో డిజిటల్ రూపి విధానాన్ని భారత రిజర్వ్ బ్యాంకు నవంబర్ 1న ప్రారంభించిందని ప్రారంభించిందని వక్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామర్స్ హెచ్ ఓ డి సంతోషి, కన్వీనర్ శ్యాం ప్రసాద్, సావన్య, నవీన్ కుమార్ ఉమాదేవి రాజేష్ శ్రీనివాస్ నరహరి మొదలగు అధ్యాపకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశం మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ జగదీశ్వర్ సార్ హాజరయ్యారు కార్యక్రమం నిర్వహించిన కామర్స్ డిపార్ట్మెంటును ప్రిన్సిపాల్ శ్రీమతి ప్రవీణ అభినందించారు.