మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రంతో కూడి శని త్రయోదశి పర్వదినం సందర్భంగా మాదాపూర్ శ్రీ శనీశ్వర దేవాలయంలో శనివారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మాదాపూర్ గ్రామ పరిధిలో, ప్రకృతి రమణీయతల నడుమ కొలువైన శ్రీ పార్వతీ పరమేశ్వర సహిత శనీశ్వర స్వామి ఆలయానికి వేకువ జామునుండే వేలాది మంది భక్తులు తరలివచ్చి తిలతైలాలతో అభిషేకాలు జరిపారు.