తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో తమ ఆట పాట ద్వారా కృషి చేసిన సాంస్కృతిక సారధి కళాకారుల సమస్యలను పరిష్కరించాలని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి. ఆంజనేయులు, ఏ నాగభూషణంలు డిమాండ్ చేశారు. శనివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సాంస్కృతిగా సారధి కళాకారులను గత ప్రభుత్వం వాడుకొని వదిలేసిందని ఈ ప్రభుత్వమైనా కళాకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.