సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 19న ఉత్తర నక్షత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 5 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు 6 గంటలకు గణపతి హోమం జరుగుతుందని చెప్పారు. రాత్రి 7 గంటలకు అష్టాదశ సోపాన మహా పడిపూజ నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.