Oct 04, 2024, 12:10 IST/
తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు
Oct 04, 2024, 12:10 IST
తెలంగాణలో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో శనివారం వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.