బీహార్‌లోని పాఠశాలకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడిని కొందరు తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసి కొట్టి, అతనికి ఓ మహిళతో బలవంతంగా వివాహం జరిపించారు. తాము 4 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నామని, అతనికి ఉద్యోగం వచ్చాక పెళ్లికి నిరాకరించాడని పెళ్లికూతురు చెప్పింది. ఆమె మాటల్లో నిజం లేదని, "నాకు ఆ అమ్మాయిపై ప్రేమే లేదు" అని పెళ్లికొడుకు అన్నాడు. ఆమె పదేపదే ఫోన్ చేసి వేధించేదని తెలిపాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.