దళితులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి

82చూసినవారు
దళితులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి
అర్హులైన దళితులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. జహీరాబాద్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 14వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దళితుల సమస్యలపై సమావేశంలో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్