భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా ఉన్నత విద్య మాజీ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి నియమితులయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆధ్వర్వంలో ఆయన నవంబర్ 21న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత కాగ్ అధిపతి గిరిశ్ చంద్ర ముర్ము పదవీకాలం ముగిసింది. ఆయన స్థానంలో సంజయ్‌మూర్తికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.