మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా మంగళవారం క్లాడియా షాన్‌బామ్ ప్రమాణ స్వీకారం చేశారు. మహిళల హక్కులను పరిరక్షిస్తానని ఆమె ప్రతిన ూనారు. లాటిన్ అమెరికాలో రెండో స్థానంలో వున్న మెక్సికో ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ పెట్టుబడులకు సురక్షితమైన లక్ష్యంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. శాస్త్రవేత్త, మెక్సికో నగర మాజీ మేయర్ అయిన షాన్‌బామ్ ఆరేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగుతారు.