అతివేగంగా దూసుకొచ్చిన స్కార్పియో తీవ్ర బీభత్సం సృష్టించింది. ఏపీలోని ప.గో. జిల్లాలోని నరసాపురంలో వేగంతో దూసుకొచ్చిన ఓ స్కార్పియో బైకును బలంగా ఢీకొట్టింది. అనంతరం వెంటనే బ్రేకులు వేయకుండా బైకును రోడ్డు కుడిపక్కకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో బైకు మీద ఉన్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బైకు నడుపుతున్న వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే ఓ కుటుంబం ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.