తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం జానంపేటలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి గ్రామ సమీపంలోని రామసముద్రం చెరువు నుంచి భారీ మొసలి బయటకు వచ్చింది. దీంతో నాగన్న ఇంట్లోకి మొసలి చొరబడి, మరుగుదొడ్డి పక్కన తిష్టవేసింది. మొసలిని చూసిన నాగన్న.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వచ్చి తాళ్లతో బంధించి రంగాపురంలోని కృష్ణా నదిలో వదిలేశారు. ఈ మొసలి 8 అడుగుల పొడవు.. 90 కిలోల బరువు ఉన్నట్లు అటవీ అధికారులు తెలిపారు.