మియాపూర్ మదీనాగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు సదరు ఉపాధ్యాయుడిని తొలగిస్తామని చెప్పారు. అయితే తిరిగి ఆ ఉపాధ్యాయుడితోనే పాఠాలు చెప్పిస్తుండడంతో విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు.