జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భారీ ఈదురుగాలులు కలకలం సృష్టించాయి. ఈ గాలుల ధాటికి పలు చెట్లు కూలిపోయాయి. దీంతో అక్కడి వాహనాలపై చెట్లు కూలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. చెట్లు రోడ్లమీద పడటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బృందం చెట్లను తొలగించేందుకు రంగంలోకి దిగింది.