మనిషి శరీరంలో ఎక్కువగా బ్యాక్టీరియా జననాంగాల్లో ఉంటుందని అనుకుంటాం. కానీ వాటికంటే అధికంగా క్రిములుండే భాగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. నోటిలోని పళ్లు, నాలుక తదితర భాగాలతో పాటు నాభి/బొడ్డు, చంకలూ వేల బ్యాక్టీరియాలకు ఆవాసాలు. అటు గాలితో పాటు ముక్కులోకి వేల సంఖ్యలో ఇవి చేరుతాయి. ముక్కు రంధ్రాల్లో వేలు పెడితే వేళ్లకూ ఇవి అంటుతాయి. ఇక గోర్లలో వేల కొద్ది బ్యాక్టీరియాలుంటాయట.