ఆఫీస్‌లో గంటలతరబడి ఒకేచోట కూర్చుని పనిచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మెడ, భుజాలు, చేతులు, నడుంవద్ద కండరాలపై ప్రభావం చూపుతుంది. కంటికి తిన్నగా కంప్యూటర్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. కీబోర్డు మోచేతులకు సమాన ఎత్తులో ఉండటం తప్పనిసరి. ముందుకు వంగి కూర్చోవడం, కంటికి దగ్గరగా కంప్యూటర్ స్క్రీన్ ఉండటం మంచిది కాదు. సౌకర్యంగా కూర్చుంటూ, మధ్యమధ్యలో విరామం తీసుకుంటే కండరాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు.