TG: మంత్రి కోమటిరెడ్డిపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యాహ్నం మద్యం తాగి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతాడని దుయ్యబట్టారు. మధ్యాహ్నం తాగి పడుకునే కోమటిరెడ్డికి మంత్రి పదవి ఎలా ఇచ్చారని మండిపడ్డారు. నల్లగొండలో మీరు.. నిజామాబాద్‌లో నేను పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేద్దాం.. ఎవరో గెలుస్తారో చూద్దామని సవాల్ విసిరారు.