గ్రాండ్‌స్లామ్ చాంపియన్, టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్‌కు పారిస్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఫ్యామిలీతో రెస్టారెంట్‌కు వెళ్లగా.. అక్కడ ఆమెకు అనుమతి దక్కలేదు. దీంతో సెరీనా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ విషయాన్ని ఆమె తన ఎక్స్ అకౌంట్‌లోనూ షేర్ చేసింది. పారిస్‌లోని పెనిన్‌సులా రూఫ్‌టాప్ రెస్టారెంట్‌లోకి తన ఫ్యామిలీతో కలిసి వెళ్లేందుకు సెరీనా ప్రయత్నించింది. టేబుల్స్ దొరకకపోవడంతో ఆమెను వెనక్కి పంపించారు.