ఒకే ఇంట్లో ఏడుగురు ‘పోలీస్’ సిస్టర్స్

82చూసినవారు
ఒకే ఇంట్లో ఏడుగురు ‘పోలీస్’ సిస్టర్స్
బిహార్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసు- అబ్కారీ శాఖల్లో, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. ఛప్రా జిల్లాకు చెందిన కమల్‌సింగ్‌కు ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. అక్కాచెల్లెళ్లు అందరూ బిహార్ పోలీసుశాఖలో, వివిధ కేంద్ర సాయుధ బలగాలకు ఎంపికయ్యారు. ఈ ఏడుగురు తల్లిదండ్రులకు ఓ భవనాన్ని నిర్మించి కానుకగా ఇచ్చారు. ప్రతినెలా వచ్చే అద్దెలతో హాయిగా బతుకుతున్నట్లు వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్