పోలీసుల అదుపులో బిగ్‌బాస్ విన్నర్

73చూసినవారు
పోలీసుల అదుపులో బిగ్‌బాస్ విన్నర్
ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్, హిందీ బిగ్‌బాస్ సీజన్ 17 విజేత మునావర్ ఫారూఖీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ ముంబై ఫోర్ట్‌లోని హుక్కా పార్లర్‌‌పై పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాడి చేశారు. ఈ దాడుల్లో ఫరూఖీతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. హుక్కా వాడినట్లు రుజువైతే వారిపై కేసు నమోదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్