సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద వాగు పొంగి వరద నీరు రోడ్డుపైకి రావడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో విజయవాడ వెళ్లే వాహనాలను ఖమ్మం, నార్కట్‌పల్లి-అద్దంకి హైవే వైపు మళ్లించారు. అటు విజయవాడ-హైదరాబాద్ రహదారిపై జగ్గయ్యపేట వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.