బాలికపై లైంగిక వేధింపులు.. చెప్పులతో కొట్టిన మహిళలు (వీడియో)

68చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడిని నడిరోడ్డుపై ఇద్దరు మహిళలు చెప్పులతో దారుణంగా కొట్టుకుంటూ సమీప పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అనంతరం పోలీసుల ఎదుటే నిందితుడిని చెప్పులతో కొట్టారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కారణంగా బాధిత కుటుంబ సభ్యులు అతన్ని కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్