పసి పిల్లల దగ్గరి నుంచి పండు ముసలి వరకు ఎవరినీ వదలకుండా కామాంధులు.. కళ్లు మూసుకుపోయి మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్న వేళ.. తాజాగా పసిపిల్లలపై లైంగిక వేధింపుల ఘటన మరో తీవ్ర దుమారానికి కారణం అయింది. ఇద్దరు 4 ఏళ్ల చిన్నారులపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించిన దుర్ఘటన మహారాష్ట్రలోని థానే నగరాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది.