మన సాంప్రదాయ దుస్తులైన చీరలు నేటి కాలంలో కనుమరుగై పోయాయి.పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మాత్రమే మహిళలు చీరలు కట్టుకుంటున్నారు. ఇక చీర కట్టుకున్న చాలామంది కొంత అసౌకర్యానికి గురవుతుంటారు. నడవటానికి, చీరను క్యారీ చేయడానికి సతమతమవుతుంటారు. ఈక్రమంలో ఓ మహిళ చీరలో యోగాసనాలు వేసి ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.