ఎత్తు పెరిగే శివలింగం.. ఎక్కడంటే.?

3631చూసినవారు
ఎత్తు పెరిగే శివలింగం.. ఎక్కడంటే.?
సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలంలోని శంభు లింగేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్ధంలో కాకతీయుల కాలం నాటి యాదవ రాజులు నిర్మించారు. స్వయంభువుగా వెలిసిన ఇక్కడి లింగం ప్రతీ 60 ఏళ్లకు ఓసారి అంగుళం పెరుగుతుందని అర్చకులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ ఆలయంలో శివలింగం పైభాగంలో ఓ గుంటలా ఉండి అందులో నుంచి నీరు వస్తుంది. ఈ నీటినే భక్తులకు పూజారులు తీర్థంగా ఇస్తారు. అలా ఎన్నిసార్లు తీసినా మళ్లీ నిండిపోవడం కనిపిస్తుంది. ఈ ఆలయంలో శివరాత్రి వంటి పర్వదినాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్