పతంజలికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి క్షమాపణలు చెప్పడాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీం కొట్టివేసింది. వారి క్షమాపణలను అంగీకరించబోమని, చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో చర్యల తీసుకోనందుకు ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీకి సైతం చీవాట్లు పెట్టింది.