గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా అల్ట్రా HDలో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇది థియేటర్ ప్రింట్ కాదని, మూవీ ఎడిటింగ్ టీమ్ నుంచే లీక్ అయిందని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో CG వర్క్ లేదని స్పష్టంగా కనపడుతోందని అంటున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రూ.కోట్లు పెట్టి సినిమాలు తీస్తే.. ఇలా పైరసీ చేస్తారా? అని మండిపడుతున్నారు.