గత CM జగన్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని, విచ్చలవిడిగా నాసిరకం మద్యం అమ్ముతూ సారా వ్యాపారిలా మారిపోయారని ఎన్నికల సభల్లో అనేకసార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. రూ.41 వేల కోట్లను మద్యం ద్వారా అక్రమంగా సంపాదించారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు పాలక పగ్గాలు చేపట్టిన తర్వాత ఇదే మద్యంపై వ్యాపారం సాగించడానికి కూటమి నేతలు సిద్ధపడడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.