TG: కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హుజురాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామ బస్టాండ్ వద్ద ఓ ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.