ఏజెంట్ల చేతిలో మోసపోయిన తెలుగు యువకులు యూరప్‌లో తిండి లేక రోడ్డున పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యూరప్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వైజాగ్‌కు చెందిన కొందరు ఏజెంట్లు మోసం చేశారని యువకులు తెలిపారు. రూ.5 లక్షలు తీసుకుని యూరప్‌లో వదిలేశారని, తిండి లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని యువకులు వేడుకుంటున్నారు.