ప్రధానిపై కాల్పులు.. పట్టుబడ్డ నిందితుడు

62చూసినవారు
ప్రధానిపై కాల్పులు.. పట్టుబడ్డ నిందితుడు
స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై బుధవారం కాల్పులు జరిగాయి. ప్రభుత్వ సమావేశం తర్వాత బయటకు వచ్చిన ప్రధానిపై దుండగుడు మూడు సార్లు తుపాకీతో కాల్చాడు. అయితే భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. కాల్పులు జరిపిన నిందితుడిని అరెస్ట్ చేశారు. తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ప్రధాని రాబర్ట్ ఫికో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్