అమెరికాలో కాల్పులు.. ఇద్దరు భారతీయులు మృతి

59చూసినవారు
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు భారతీయులు మృతి
అమెరికా వర్జీనియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో భారతీయులైన తండ్రి, కూతురు మరణించారు. గుజరాత్‌కు చెందిన ప్రదీప్ కుమార్ పటేల్ (56) అమెరికాలోని ఓ జనరల్ స్టోర్‌లో పనిచేస్తున్నారు.ఈ క్రమంలో శుక్ర వారం తన కూతురు (24)తో కలిసి స్టోర్‌లో ఉండగా దుకాణంలోకి ప్రవేశించిన దుండగుడు వారిపై కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్