బన్నీకి జైలా? బెయిలా?

79చూసినవారు
బన్నీకి జైలా? బెయిలా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. ఆయనకు రిమాండ్ విధించాలని పోలీసుల తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. అనుమతులు లేకున్నా సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారని వారు కోర్టుకు తెలిపారు. మరోవైపు తనపై కేసు కొట్టివేయాలని బన్నీ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే రిమాండ్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. రేవతి మరణానికి బన్నీ ప్రత్యక్షంగా కారణం కాదని ఆయన తరపు లాయర్లు వాదిస్తున్నారు.

సంబంధిత పోస్ట్