గుకేశ్‌కు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన స్టాలిన్

50చూసినవారు
గుకేశ్‌కు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన స్టాలిన్
ఫిడే ప్ర‌పంచ చెస్ చాంపియ‌న్‌షిప్ టైటిల్ గెలిచిన దొమ్మ‌రాజు గుకేశ్‌కు రూ.5 కోట్లు క్యాష్ ప్రైజ్‌ ఇవ్వ‌నున్న‌ట్లు త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ప్ర‌క‌టించారు. సింగ‌పూర్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ చెస్ టోర్నీలో గుకేశ్ విశ్వ‌విజేత‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. గుకేశ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం ఆయ‌నను మెచ్చుకున్నారు. ‘తమిళనాడు మిమ్మల్ని చూసి గర్విస్తోంది. చెన్నై ప్రపంచ చెస్ క్యాపిటల్‌గా తన స్థానం నిలబెట్టుకుంది’ అని స్టాలిన్ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్