సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్‌ను ఆయన ట్యాగ్ చేశారు.