ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు భారత క్రికెటర్ శ్రేయాంకా పాటిల్ నామినేట్ అయ్యారు. ఇంటర్‌నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఏటా ఈ అవార్డులను యంగ్ ప్లేయర్లకు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ నుంచి స్టార్ బౌలర్ శ్రేయాంకా నామినేట్ అయ్యారు. ఆమెతో పాటు ఇతర దేశాలకు చెందిన సస్కియా హార్లీ, అన్నరీ డెర్క్‌సెన్, ఫ్రెయా సార్జెంట్‌లు కూడా నామినేట్ అయ్యారు.