వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా మరో న్యూస్ అయితే చక్కర్లు కొడుతోంది. గోదావరి జిల్లాలకు చెందిన మాజీ హోం మంత్రి తానేటి వనిత కూడా వైసీపీకి దూరం అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఓటమి తర్వాత ఆమె కూడా సైలెంట్ అయ్యారు. అయితే ఆమె సొంత పార్టీ అయిన టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తొందరలోనే ఆమె వైసీపీని వీడుతారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.