రైతు దినోత్సవాలు పురస్కరించుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఆదర్శ రైతులను సన్మానించడం జరుగుతుందని దుబ్బాక స్టేట్ బ్యాంక్ మేనేజర్ సందీప్ తెలిపారు. గురువారం దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో ఆదర్శ రైతులుగా ఎంపికైన జోగు నరసయ్య, నాగరాజు, రెడ్డి మహిపాల్ రెడ్డిలను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం బ్యాంకు అందించే పంట రుణాలపై పలు సూచనలు చేశారు.