ప్రొటోకాల్ పేరుతో బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకోవడం తగదని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకట్ స్వామి గౌడ్ అన్నారు. అక్బర్పేట- భూంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన మంత్రి కొండా సురేఖ కార్యక్రమాలపై ప్రొటోకాల్ పేరుతో బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు.