రైతుల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తులను నట్టేట ముంచిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. సోమవారం సిద్దిపేట- మెదక్ రహదారిలోని హబ్సిపూర్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. రైతుబంధు రూ.15,000 బదులు ఎకరానికి రూ.12,000 ఇవ్వడాన్ని ఎమ్మెల్యే తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, నేతలు పాల్గొన్నారు.