మిరుదొడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జాతీయ నులి పురుగు నివారణ మాత్రలను గురువారం విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులకు రక్తహీనత వ్యాధి ఏర్పడకుండా ఉండడంతో పాటు నులి పురుగుల నివారణకు మాత్రలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు.