వైన్స్ లో బీర్లు లేవని మద్యం ప్రియుల ఆందోళన

3311చూసినవారు
సిద్దిపేట జిల్లా తొగుట మండలం మెట్టు వైన్ షాపులో బీర్లు లేవంటూ సోమవారం మద్యం ప్రియులు ఆందోళన చేపట్టారు. బీర్లు తెచ్చేంత వరకు వెళ్ళేది లేదంటూ వైన్స్ ముందు ఆందోళన నిర్వహించి అలజడి సృష్టించారు. పోలీసులు వచ్చి నచ్చ చెప్పినప్పటికీ వినలేదు. వైన్ షాపు నిర్వాహకులతో గొడవకు సైతం దిగారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

సంబంధిత పోస్ట్