సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్ లో వాచ్ ఉమెన్ పోస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి ప్రవీణ్ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7వ తారీకు నుండి 11వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. పదవ తరగతి విద్యార్హతగా తెలిపారు. రోజు సాయంత్రం 5 గంటల నుండి మరునాడు ఉదయం 9 గంటల వరకు పని వేళలు ఉంటాయన్నారు. ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు.