దుబ్బాక: ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
గ్రామాల్లో రైతులు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఉపాధి హామీలో భాగంగా పండ్లతోటలు, కోళ్లపారాల షెడ్లు, పశువుల పాకల నిర్మాణం, నీటి సంరక్షణ చర్యలు వంటివి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.