సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ మధిర సేలంపు గ్రామంలో నాలుగవ అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆదేశాల మేరకు తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ టీచర్ బాలలక్ష్మి శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా పుట్టగానే మురుపాలు పట్టించాలని అంగన్వాడీ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషక ఆహారాలు విటమిన్లు కలిగి ఉన్నవి ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ బాలలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.