గజ్వేల్: నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలి

84చూసినవారు
గజ్వేల్: నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
వాహనదారులు రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోగలరని సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సీఐ సైదా అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొల్గుర్ శివారులోని మూల మలుపుల వద్ద ప్రమాద హెచ్చరిక, సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనదారులు గ్రామంలో రోడ్డు మూలమలుపులపై జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు, రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్