పేకాట స్థావరంపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 1, 04, 833 నగదు స్వాధీనం చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. కొంతమంది పేకాట ఆడుతున్నారనే సమాచారంతో శిబిరంపై దాడిచేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.