గజ్వేల్ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుంది: షబ్బీర్ అలీ

76చూసినవారు
గజ్వేల్ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుంది: షబ్బీర్ అలీ
గజ్వేల్ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి నేతృత్వంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, సర్దార్ ఖాన్, తంజిముల్ మజీద్ కమిటీ చైర్మన్ మథిన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తాను తప్పకుండా హాజరవుతానని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్