సెల్ టవర్ల బ్యాటరీలు చోరీకి పాల్పడుతున్న నిందితులను పట్టుకొని అరెస్టు చేశామని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిందితులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో సెల్ టవర్ల బ్యాటరీలను చోరీచేసి ఓ స్క్రాప్ దుకాణంలో విక్రయిస్తున్నారు. సెల్ టవర్ బ్యాటరీలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు అందుకున్న గజ్వేల్ పోలీసులు టెక్నాలజీ సాయంతో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.