బైకు అదుపు తప్పి ఇరువురికి తీవ్ర గాయాలు

67చూసినవారు
బైకు అదుపు తప్పి ఇరువురికి తీవ్ర గాయాలు
బైకు అదుపు తప్పి కింద పడటంతో ఇరువురికి తీవ్ర గాయాలైన సంఘటన నంగునుర్ మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది అశోక్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేటకు చెందిన నాంపల్లి, నరేష్ లు శనిగరం వివాహానికి వెళ్లి వస్తుండగా అల్లిపూర్ గ్రామ శివారులోకి రాగానే బైకు అదుపు తప్పడంతో కిందపడి ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. నరేష్ కు తలకు తీవ్ర గాయం కావడం తో పరిస్థితి విషమంగా ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్