Nov 06, 2024, 09:11 IST/
గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో ఘటన జరగటం దారుణం: హరీశ్
Nov 06, 2024, 09:11 IST
వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటన మరువకముందే బుధవారం మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలవ్వటం దారుణమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కారణాలు చెబుతూ తప్పించుకోవడం వల్ల ప్రయోజనం లేదన్నారు. విద్యార్థుల ప్రాణాల పట్ల కార్యాచరణ ప్రకటించాలని.. గురుకులాల్లో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.